Thursday 6 January 2011

శ్రీ కృష్ణ తాండవీయం

ఇది నిజంగా శ్రీ కృష్ణుడి (జుస్టిస్ శ్రీ కృష్ణ కంమిస్సిఒన్) తెలంగాణావాదుల మీద వికృత తాండవీయం. మొదటినుండి మనమందరం ఊహించిన అంశాల సమాహారం. దీనికోసం దేశ ప్రజాధనం రు. 20 కోట్లు వృధా. ఏదో సామెత చెప్పినట్టు "కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పడినట్లుంది".

ఏది ఏమిన ఇందులో ఒకటి నిక్కచిగా చెప్పినట్టు, వైద్య విద్య ఆర్ధిక రాజకీయ అణచివేత జరిగింది అనే మన తెలంగాణావాదుల ముక్తకంటాన్నితన "మురళి గానంతో" వినిపించాడు ఈ "వృద్ధ కృష్ణుడు".

ఒక్కటి మాత్రం నిజం, ఆంధ్ర ప్రాంత ప్రజల "తెలంగాణా" వివక్ష ఎంత నిగూడంగా వుందో ఉదాహరణ ఏంటంటే, నా కోస్త ఆంధ్ర స్నేహితుడి భార్య ఎప్పుడు కూడా మమల్ని "తెలంగాణా వాళ్ళు" అని సంబోదిస్తూ వుంటుంది. నేను చాలా సార్లు తనని అడిగినప్పుడు అవును మీది ఆ ప్రాంతమే కదా అని తనని సమర్దిస్తూ వుంటుంది. ఇది నిజంగా వివక్షత కాదా. ఇలా ఒక NRI ప్రవర్తిస్తూవుంటే, సగటు సీమంధ్ర ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులూ మన తెలంగాణా ప్రజలని ఏ విధంగా వివక్షిస్తారో ఊహించుకోవచ్చు.

అందుకే "ప్రత్యెక తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు తధ్యం అనేది నివురు కట్టిన నిప్పులా తప్పక బయటికి వచ్చి తీరుతుంది.

మీ కోసం ఈ "శ్రీ కృష్ణుడి వికృత తాండవీయం" - నివేదికని ఇక్కడ ఉంచుతున్నాం.

రిపోర్ట్ - 1

http://pib.nic.in/archieve/others/2011/jan/d2011010502.pdf

రిపోర్ట్ - 2

http://pib.nic.in/archieve/others/2011/jan/d2011010503.pdf

మీ

చిన్న (ఒక తెలంగానీయుడి ఉక్రోశ)

No comments:

Post a Comment