Friday 25 December 2009

తెలంగాణ - సమగ్ర చర్చలేదా ఏకాభిప్రాయం?

తెలంగాణ - విద్యార్థుల నెత్తురోడ్డుతూ ఇప్పుడొక రాజకీయ రణరంగ వేదికగ మారింది. కానీ ఇలా జరగడానికి కారణం ఎవరు?

తెలంగాణ చరిత్ర గురించి ఇంతకూ ముందు బ్లాగ్ శీర్షికలో చెప్పుకోవడం జరిగింది. కానీ దీనిని చదివి కూడా సాటి తెలుగు సోదరులు/సోదరినులు ఇంకా తమ ప్రాంత(స్వ) అభిప్రాయాలని తెలంగాణాకి ఆపాదిస్తూ సగటు సీమాంధ్ర రాజకీయనాయకులాలా మాట్లుడుచున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఈ మధ్యన మన కేంద్ర ప్రభుత్వం ప్రకటన చూదండి.

Sri Chidambaram - Home Minister of India (Statement on 23 Dec 2009)
On formation of Telangana state there is a need to molde wide ranging consultation with wide political parties and groups in the state.of A.P. Govt of India will take steps to involve all concerns in the process.

దాని ఫై నా లాంటి సగటు తెలంగాణ తెలుగు పౌరులు తెలంగాణ ఏర్పాటు ఫై అభిప్రాయ సేకరణకానీ, సమగ్ర చర్చైనా కానీ, మరీ ఏ విధమిన చర్చకు గురించి పట్టుపట్టే వారిని క్రింది ప్రశ్నలకు జవాబులని ఆత్మసాక్షిగా చెప్పమనండి?

1. మద్రాస్ స్టేట్ నుండి ఆంధ్ర రాష్ట్ర విభజన మరియు ఏర్పాటు గురించి సాటి భారతీయులైన తమిళుల అభిప్రాయ సేకరణ జరిగిందా? మరీ అప్పుడు అడగని అభిప్రాయం ఇప్పుడెందుకు?
2. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో అప్పటి హైదరాబాద్ స్టేట్ (తెలంగాణ ప్రాంత) విలీనంఫై ఆ ప్రాంత ప్రజల అభిప్రాయ సేకరణ జరిగిందా? State Re-organisation commision అభిప్రాయాన్ని మించి ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకోవడం జరిగింది. (ఆంధ్ర రాజకీయనయకులదా?)
౩. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూల్ని (టెంట్లలో అసెంబ్లీ, సేక్రాటరైట్, హై కోర్ట్) నుండి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటులో హైదరాబాద్ ని రాజధానిగ మార్చడంలో ఆ ప్రాంత అభిప్రాయసేకరణ/చర్చ జరిగినదా?
4 శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని వక్రీకరించి చెబుతున్న మన నాయకులకి సూటిగా ప్రశ్నిస్తే వారి త్యాగం ఫలితం మీకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నుండి తెలంగాణ ఆక్రమణకి దోహదపదిండా?

మన భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక రాష్ట్ర ఏర్పాటులో ఇంతటి వివక్షని ఏ కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించలేదు? మరి తెలంగాణ ఫై, తెలంగాణ ప్రాంత ప్రజలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రబుత్వం ఎందుకింత సవతి ప్రేమ ప్రదర్శిస్తుంది? ఏ రాజకీయ లాభాపేక్షతో ఈ సందిగ్ధ వాతావరణానికి కారణభూతమైంది? ఇరు ప్రాంత విద్యార్ధుల, ప్రజల ప్రాణహానికి కారణమైంది ఏ ఉద్దేశ్యంతో?

ప్రస్తుత పరిస్థితి తెలంగాణ ప్రజల మాటల్లో వింటే "ఇంటివాడు తనింటికి వస్తే దొంగోడికి కోపం వచిన్దన్నట్టు? సీమాంద్ర రాజకీయనాయకుల తెలంగాణ ప్రాంత ప్రజలపై ఈ దోపిడీ ఆక్రమణ ఇకనైనా ఆగాలంటే తెలంగాణ రాష్ట్ర అవిర్భావమొక్కటే పరిష్కారం. దీనిపై ఎటువంటి ప్రజాభిప్రాయం, రాజకీయ చర్చ అవసరం లేదు. ఒకవేళ చర్చ జరగాల్సి వస్తే అది ఇప్పటి వరకు తెలంగాణ దోపిడీకి కారణమైన "పెద్ద మనష్యులపై" మాత్రమే.

ఇది ఒక సాటి తెలుగు అంతరాత్మ గోష

No comments:

Post a Comment