Monday 10 January 2011

'సీమాంధ్ర' బాబు - 'సీమాంధ్ర' జగన్ - 'సదరు' తెలంగాణా నాయకుడు

తెలుగు మిత్రులారా, గత కొన్నిరోజులుగా 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రంలో మన 'బాబు' - మన 'జగన్' రైతులపై ఎనలేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.

సదరు మొదటి వ్యక్తి, తెలంగాణా - సీమాంధ్ర సమస్య, డిసెంబర్ గడువు గుర్తెరిగి, ఎప్పుడో మొదటి వారంలో కురిసిన అకాల వర్షాలకు, సరిగ్గా పక్షం రోజులు సమయం తీసుకోని, తెలంగాణా సమస్యని 'హైజాక్' చేయాలనే కుట్రతో, 17 డిసెంబర్ నుండి ఒక వారం 'తూతూ' మంత్రంగ దీక్ష కూర్చొన్నారు. తన తొమ్మిది సంవత్సరాల పాలనలో ఒక్క 'IT' జపం చేస్తూ 'ఈ రైతులను పట్టించుకోకుండా, వారి చలో అసెంబ్లీ కార్యక్రమంలో 'నవ దయ్యరై' తుపాకులు ఎక్కుపెట్టాడు.

ఇక రెండవ వ్యక్తి, తండ్రిగారి ఐదు సంవత్సరాల పాలనలో, MPగ వుంటూ, గతమేన్నడు లేని విధంగా అత్యధికంగా సంపాదించి, 'అత్యదికంగా పన్ను' చెల్లించి, అప్పుదేప్పుడు గుర్తుకురాని 'రైతన్న' సమస్యని ఆలస్యంగానైన, మన తెలంగాణా విషయాన్నీ దారిమల్లించడానికి, 2 రోజుల దీక్ష, ఇప్పుడు ఢిల్లీ ప్రయాణంతో 'తన' ఉనికిని చాటుతున్నాడు.

గత దశ్బ్తలుగా తెలంగాణా గురించి విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు మొదలు సామాన్య ప్రజలు వుద్యమిస్తుంటే, ఎన్నికల సమయంలో వారివారి వోట్ల కోసం 'తెలంగాణా' అనుకూలమని ఇటు 'తెలంగాణా ప్రజలను' అటు 'సీమాంధ్ర ప్రజలను' మోసంచేస్తు ఎన్నడో మరచిన 'రైతన్న' సమస్యని తీరా వీరి అభిప్రాయం చెప్పమనేసరికి తప్పించుకు తిరుగుతూ రెండు ప్రాంతాల కాదు, మూడు ప్రాంతాల ప్రజలని ఇంకా నిలువునా మోసం చేస్తున్నారు.

ఏమైనా వీరిని వారిని అని ఏమిలాభం, 'మన బంగారం మంచిది కాకపోతే' అదే మన తెలంగాణా కాంగ్రెస్ తెలుగు దేశం రాజకీయ నాయకులూ, వాళ్ళని నడిరోడ్డు మీద నిలబెట్టి కడిగెయ్యాలి కాదు ఉతికి ఆరెయ్యాలి.

'సీమాంధ్ర' స్నేహితులారా ఇప్పుడు 'శ్రీ కృషునుడి' నీవేదికలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడినదని చెబుతుంటే, పైన చెప్పిన వారి వారి కుటుంబాలు వచ్చిన ప్రాంతానికి వారు ఏమి చేసారని 'ఏ ఒక్క రాయలసీమ' లేదా 'ఆంధ్ర' తెలుగు స్నేహితులు ప్రశ్నించారా? లేదే. కాని తెలంగాణా విడిపోయిన పరవాలేదు కానీ 'హైదరాబాద్' మాత్రం కావలె అని మూర్కంగా వితండ వాదం చేస్తారు. మొదలు నివేదిక చదివి 'మీ మీ నాయకుల్ని' నిలబెట్టి ప్రశ్నించండి. ఇప్పటికైనా విడిపోతే, వాడు మోసం చేసాడు, వీడు దగా చేసాడు అనే కుంటి సాకులు వుండవు.

ఇప్పటికైనా మేల్కొనండి ఈ దగా రాజకీయ నాయకులని పట్టుకోవాలంటే 'సముద్రంలాంటి పెద్ద రాష్ట్రాల్ల్లో' కష్టం. చిన్న రాష్ట్రం, చిన్న కేబినేట్, చిన్న బడ్జెట్, కళ్ళముందు కనపడే పారదర్శక పరిపాలనతో మాత్రమే సాధ్యం. ఈ విధంగానైన ఒక్క 'హైదరాబాద్' కాకుండా మరిన్ని 'హైదరాబాద్'లు ఏర్పడతాయి. అవి గ్రామాలతో, అక్కడి రైతులతో, ప్రజలతో కలసిపోతాయి. అప్పుడు మాత్రమె 'పట్టణ వలసలు' అంతరించి పోతాయి.

ఇది ఒక తెలంగాణా తెలుగోడి ఉక్రోశ.

మీ చిన్న

Thursday 6 January 2011

శ్రీ కృష్ణ తాండవీయం

ఇది నిజంగా శ్రీ కృష్ణుడి (జుస్టిస్ శ్రీ కృష్ణ కంమిస్సిఒన్) తెలంగాణావాదుల మీద వికృత తాండవీయం. మొదటినుండి మనమందరం ఊహించిన అంశాల సమాహారం. దీనికోసం దేశ ప్రజాధనం రు. 20 కోట్లు వృధా. ఏదో సామెత చెప్పినట్టు "కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పడినట్లుంది".

ఏది ఏమిన ఇందులో ఒకటి నిక్కచిగా చెప్పినట్టు, వైద్య విద్య ఆర్ధిక రాజకీయ అణచివేత జరిగింది అనే మన తెలంగాణావాదుల ముక్తకంటాన్నితన "మురళి గానంతో" వినిపించాడు ఈ "వృద్ధ కృష్ణుడు".

ఒక్కటి మాత్రం నిజం, ఆంధ్ర ప్రాంత ప్రజల "తెలంగాణా" వివక్ష ఎంత నిగూడంగా వుందో ఉదాహరణ ఏంటంటే, నా కోస్త ఆంధ్ర స్నేహితుడి భార్య ఎప్పుడు కూడా మమల్ని "తెలంగాణా వాళ్ళు" అని సంబోదిస్తూ వుంటుంది. నేను చాలా సార్లు తనని అడిగినప్పుడు అవును మీది ఆ ప్రాంతమే కదా అని తనని సమర్దిస్తూ వుంటుంది. ఇది నిజంగా వివక్షత కాదా. ఇలా ఒక NRI ప్రవర్తిస్తూవుంటే, సగటు సీమంధ్ర ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులూ మన తెలంగాణా ప్రజలని ఏ విధంగా వివక్షిస్తారో ఊహించుకోవచ్చు.

అందుకే "ప్రత్యెక తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు తధ్యం అనేది నివురు కట్టిన నిప్పులా తప్పక బయటికి వచ్చి తీరుతుంది.

మీ కోసం ఈ "శ్రీ కృష్ణుడి వికృత తాండవీయం" - నివేదికని ఇక్కడ ఉంచుతున్నాం.

రిపోర్ట్ - 1

http://pib.nic.in/archieve/others/2011/jan/d2011010502.pdf

రిపోర్ట్ - 2

http://pib.nic.in/archieve/others/2011/jan/d2011010503.pdf

మీ

చిన్న (ఒక తెలంగానీయుడి ఉక్రోశ)